పోసాని కృష్ణమురళి(Posani Krishna murali) ఇచ్చిన షాక్ తో వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala ram krishna leddhi) విలవిల్లాడుతున్నారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్(Pawan klayn), లోకేష్ తో పాటు.. వారి కుటుంబ సభ్యులపై తీవ్రమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పోసాని. తన వ్యాఖ్యలకు కారణం పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి అని పోలీసులకు పోసాని చెప్పడంతో.. సజ్జల అడ్డంగా ఇరుక్కుపోయారు. ముందు ముందు పోసానిని పక్కనపెట్టి సజ్జలనే పోలీసులు సీన్లోకి తీసుకువచ్చి రకరకాల కేసులు వేసే పరిస్థితి కనబడుతోంది. ఇది ఇక్కడితో ఆగే అవకాశం లేదని.. సజ్జల తర్వాత మరింతమంది వైసీపీ నేతల మెడకు పోసాని వ్యవహారం చుట్టుకోబోతోందని.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
టిడిపి, జనసేన నేతలపై తిట్ల వ్యవహారంలో పోసాని కృష్ణ మురళి ఒక్కడే కాదు.. ఈ వ్యవహారంలో శ్రీ రెడ్డి కూడా కీలకపాత్ర వ్యవహరించారు. గతంలో ఈ విషయానికి సంబంధించి కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు పోసాని సంగతి పూర్తయిన తర్వాత శ్రీ రెడ్డి పై కూడా పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.