ఎందుకో గానీ.. మనోజ్(Manchu Manoj) అంటే తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తండ్రి మోహన్ బాబు.. ఏ దశలోనూ వెనక్కు తగ్గడం లేదు. చివరికి.. రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్(Collector) ఎదుట తమ వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు కూడా అదే తీరుగా స్పందించారు. ఓ దశలో.. ఇద్దరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారట. ఇది చూసిన కలెక్టర్ ప్రతిమ సింగ్(Prathima singh).. అసహనానికి గురై.. ఇద్దరినీ వారించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. తనకు కలెక్టర్ గా ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా.. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకువద్దామని దాదాపు 2 గంటల పాటు ప్రతిమ సింగ్ చేసిన ప్రయత్నం విఫలమైనట్టు సమాచారం. అంతగా.. మోహన్ బాబు(Mohan babu), మనోజ్.. పరస్పరం తిట్టుకున్నట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది.










