వైసీపీలో(YCP) విజయసాయిరెడ్డి(Vijaysai reddy) పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాక, మరీ ముఖ్యంగా వైసీపీ సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాక.. ఆయన వేస్తున్న అడుగుల గురించైతే కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఆ అడుగులు.. వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న తీరును గురించి కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే.. జగన్(YS jagan) కాంగ్రెస్ ను వీడి వైసీపీని ఏర్పాటు చేసిన క్షణం నుంచి.. విజయసాయిరెడ్డి ఎంతో కీలకంగా వ్యవహరించారు. 2014లో ప్రతిపక్ష హోదా అందుకున్న దగ్గరినుంచి.. 2019 లో అధికారాన్ని అందుకునేంత వరకు.. ప్రతి అడుగులో తన ముద్ర వేశారు. విశాఖను పూర్తి స్థాయి రాజధానిని చేద్దామన్న జగన్ కన్న కలను సాకారం చేయాలని కూడా తీవ్రంగా శ్రమించారు. చివరికి.. అందరికీ షాక్ ఇస్తూ.. రీసెంట్ గా రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో వెనక్కు వెళ్లిపోతున్నట్టు ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు.