ఆస్ట్రేలియా టీ20(Australia T20) కెప్టెన్ మిచెల్ మార్ష్(Mishel Marsh) గాయం కారణంగా ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తప్పుకున్నాడు. అలాగే వన్డే కెప్టెన్ పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ కూడా ఈ టోర్నమెంట్‌కు దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు మరో నిరాశగా నిలిచింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) వన్డే క్రికెట్(one day cricket) నుండి అనూహ్యంగా రిటైర్ అవడం నిర్ణయించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. “ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులభం కాదు, కానీ నా కెరీరులో తదుపరి దశకు పూర్తి ఫోకస్ పెట్టడానికి ఈ సమయం సరైనది” అని మార్కస్ స్టోయినిస్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం సమీపిస్తుండగానే, స్టోయినిస్ ఈ అప్రతిక్రమణీయ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో, ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు వన్డే టోర్నమెంట్ కోసం మరో ఆల్ రౌండర్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన ఆస్ట్రేలియా జట్టులో 15 మంది సభ్యులలో మార్కస్ స్టోయినిస్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన తన వన్డే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగించనున్నట్లు ప్రకటించారు. 35 ఏళ్ల స్టోయినిస్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, టీ20 క్రికెట్ కొనసాగిస్తానని చెప్పారు. ఇక, భవిష్యత్తులో ఫ్రాంచైజ్ లీగ్‌లపై మరింత దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించారు. మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియా తరపున 71 వన్డేలు ఆడారు. 64 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి, 1 సెంచరీ, 6 అర్ధ సెంచరీలతో 1495 పరుగులు సాధించారు. అలాగే 48 వికెట్లు కూడా తీసుకున్నారు.