Home Entertainment Sai Pallavi : రాజా సాబ్, సలార్ 2, కల్కి 2 మరియు ఫౌజీలో సాయి...

Sai Pallavi : రాజా సాబ్, సలార్ 2, కల్కి 2 మరియు ఫౌజీలో సాయి పల్లవి?

sai pallavi
sai pallavi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్ గా రెండు బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు రెబల్ స్టార్. ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో వచ్చిన సలార్(salaar) సినిమా సంచలన విజయం సాధించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మరోసారి ప్రభాస్ సత్తా ఎంతో బాక్సాఫీస్ కు రుచి చూపింది సలార్ ఈ సినిమా దాదాపు రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ను తెరకెక్కించనున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేశాడు ప్రభాస్. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది కల్కి.. ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ప్రశాంత్ సలార్ 2, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హనురాఘవపుడి(Hanuraghavapudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హను తెరకెక్కిస్తున్న సినిమాకు ఫౌజీ అనే ఆసక్తికర టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా యుద్ధనేపథ్యంలో ఉంటదని టాక్.

కాగా ఈ సినిమా పూజాకార్యక్రమం ఆ మధ్య మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వీ నటిస్తుందని కన్ఫార్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఫౌజీ సినిమాలో సాయి పల్లవి(Sai pallavi) హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో హీరోయిన్ గా సాయి పల్లవి అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించినట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. గతంలో హనురాఘవపూడి దర్శకత్వంలో సాయి పల్లవి పడిపడి లేచే మనసు సినిమా చేసిన విషయం తెలిసిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here