అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం సాక్షిగా.. టీడీపీ(TDP) కార్యకర్తలు మనస్థాపానికి గురయ్యారు. అది వేరే ఎవరి వల్లో కాదు. స్వయానా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు(Ram mohan naidu) కారణంగా తీవ్రంగా బాధపడ్డారు. రథసప్తమి పండుగ నాడు జరిగిన ఈ ఘటనతో.. టీడీపీ కేడర్(TDP cadare) దాదాపుగా అవాక్కయింది. ఆ రోజు పండుగ సందర్భంగా ఆలయంలో ప్రముఖ సింగర్ మంగ్లీతో(Manglii) సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదే సమయంలో.. ఆలయానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లారు. ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. తను దర్శనానికి వెళ్తుండగా మంగ్లీ కూడా కలిసి రావడంతో.. అంతా కలిసి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఇందులో ఏముంది.. అంతగా బాధ పడడానికి అని అనుకోకండి. అసలు విషయం ఇక్కడే ఉంది.
అలా రామ్మోహన్ నాయుడుతో కలిసి మంగ్లీ వెళ్లి ప్రత్యేక దర్శనం చేసుకోవడం.. టీడీపీ కేడర్ ను విపరీతంగా డిస్టబ్ చేసింది. గతంలో మంగ్లీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్(YCP) కోసం ప్రత్యేక పాటలు పాడి.. జగన్(YS Jagan) గెలుపు కోసం తనవంతు ప్రయత్నం చేసింది. అదే సమయంలో.. టీడీపీ కోసం కూడా పాటలు పాడాల్సిందిగా మంగ్లీకి ఓ రిక్వెస్ట్ వెళ్లిందట. కానీ.. తనకు చంద్రబాబు(Chandrababu) పేరు పలకడం కూడా ఇష్టం లేదు అన్నంతగా మంగ్లీ నుంచి రిప్లై వచ్చిందట. అప్పటి నుంచి మంగ్లీ అంటే.. టీడీపీ కేడర్ తీవ్రంగా కోపగించుకుంటూ వస్తోందట. ఇలాంటి పరిస్థితుల్లో.. తనతో పాటు ప్రత్యేక దర్శనానికి మంగ్లీని రామ్మోహన్ నాయుడు తీసుకువెళ్లడం ఏంటన్న చర్చ.. టీడీపీ కేడర్ లో కాస్త బలంగానే జరుగుతోంది.
https://youtu.be/dOYsBbUA33Q