తెలంగాణ కాంగ్రెస్‌కు(Telangana Congress) ఊహించని షాక్కొట్టింది.అది అలాంటిలాంటి షాక్ కాదు .దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది .. ఎవరి గోతిలో వాళ్లే పడతారు అనేసామెత వూరికే పుట్టిందా ?.brs దెబ్బకి కాంగ్రెస్ చిత్తయింది … ఇప్పుడు ఈ విషయం గురించే చర్చ రాజకీయ వర్గాల్లో
హాట్ టాపిక్ అయింది .
అసలింతకీ ఏమి జరిగిందనుకుంటున్నారా .. సోషల్ మీడియా(Social media) వేదికగా ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. అధికారంలో ఉన్న బీఆర్ఎస్(BRS) తమ పాలన గొప్పతనాన్ని చాటుకోవడానికి,,, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ వైఫల్యాలను ఎత్తి చూపడానికి సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకున్నారు .brs చెప్తున్నదంతా అబద్దం అని నిరూపిద్దామనుకుంది కాంగ్రెస్ .. ఇంకేముంది అనుకున్నదే తడువుగా ,, వ్యూహాత్మకంగా ఒక ప్రశ్నను(Poll) సంధించింది. “ఫామ్ హౌస్ పాలన(Farm house palana) కావాలా? ప్రజల వద్దకు పాలన(Praja palana) కావాలా?” అంటూ ప్రజలను ప్రశ్నించింది. ఒకవిధంగా ఎన్నికల్లో brs ఓడిపోయాక కేసీఆర్(KCR) ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు , సమస్యలొచ్చినా స్పందించట్లేదు ,,ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని విమర్శించడం కాంగ్రెస్ లక్ష్యం.
ఈ విమర్సే కాంగ్రెస్ కొంప ముంచింది .. కాంగ్రెస్ వేసిన ఈ ప్రశ్నకు సోషల్ మీడియాలో ,, కౌంటర్ ఎటాక్ మొదలయ్యింది . ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి, పోలింగ్‌లోపాల్గొన్నారు ..దీంతో అనుకున్నదొకటి ,,అయినది ఇంకొకటి అని తెలుసుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ .. ఎవరూ ఊహించని విధంగా “ఫామ్ హౌస్ పాలన” వైపే 70%, 80%ప్రజలంతా మొగ్గు చూపారు. ప్రజలు ఫామ్ హౌస్ పాలననే కోరుకుంటున్నారా అనేంతలా కుండా బద్దలు కొట్టినట్టు చెప్పేసారు ..ఇంకేముంది సీన్ రివర్స్ అయిపోయింది ..
అనుకోని ఈ పరిణామంతో కాంగ్రెస్అవాక్కయింది . తమ వ్యూహం బెడిసి కొట్టడంతో వెంటనే పోలింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత,, ఒక ఛానెల్‌లో ఇదే అంశంపై పోల్ పెట్టినా,, ఇలాంటి resulte రిపీట్ అయ్యింది .. మరోవైపు ఢిల్లీ గల్లీలో కూడా బీజేపీ(BJP) ఈ పోలింగ్ గురించే ప్రజలకి చెప్తూ ,,ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది .. .. దీంతో కాంగ్రెస్ పార్టీ నెత్తినోరు కొట్టుకుంటోంది .`. దారినపోయే దరిద్రాన్ని,, కెలికి మరీ నెత్తిన పెట్టుకున్నట్లుంది అని ,, కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. మొత్తానికి కాంగ్రెస్ వేసింది పెద్ద ప్లానింగే అని ఈ ఫలితాలను చూసి నవ్వుకుంటున్నారు. ఈ ఎదురు దెబ్బతో అన్న కాంగ్రెస్, భవిష్యత్తు ప్రణాళికను ఏ విధంగా రూపొందిస్తుందో వేచి చూడాలి.









