‘బద్రి’ (Badri) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) మొన్ననే సిల్వర్ జూబ్లీ (Silver Jubilee) జరుపుకున్నాడు. తొలి సినిమాతోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా (Daring and Dashing Director) పేరు తెచ్చుకున్న పూరీ.. ఆ తర్వాత ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు తీశాడు. మహేశ్‌బాబు (Mahesh Babu)తో తీసిన ‘పోకిరి’ (Pokiri) ఇండస్ట్రీ రికార్డులతో హోరెత్తిపోయింది. అయితే క్రమంగా తన ప్రాభవం కోల్పోతూ వచ్చిన ఆయన ఇప్పుడు డిజాస్టర్స్ (Disasters) డైరెక్టర్‌గా మారిపోయాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన ‘లైగర్’ (Liger), ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) మూవీలు చూస్తే పూరీ క్రియేటివిటీ (Creativity) ఏస్థాయిలో దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఈతో ఆయనతో సినిమా అంటేనే హీరోలు మొహం చాటేసే పరిస్థితి వచ్చింది. మొన్న ఉగాదికి (Ugadi) తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ప్రాజెక్టు ప్రకటించిన పూరీ జగన్నాథ్ అందరినీ ఆశ్చర్యరానికి గురిచేశాడు. దీంతో చాలామంది విజయ్ సేతుపతిని ట్రోల్ (Troll) చేయగా.. పూరీ చెప్పిన కథ నచ్చడంతోనే తాను ఒప్పుకున్నట్లు వివరణ ఇచ్చాడు. ఈ మూవీకి ‘బెగ్గర్’ (Beggar) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
అనౌన్స్‌మెంట్ (Announcement) తోనే క్యూరియాసిటీ (Curiosity) క్రియేట్ చేసిన ఈ మూవీని పాన్ ఇండియా (Pan India) స్థాయిలో తీస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఇందులో సీనియర్ బ్యూటీ టబు (Tabu) కీలక పాత్రలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు రాధికా ఆప్టే (Radhika Apte)ని హీరోయిన్‌గా (Heroine) తీసుకుంటున్నట్లు వార్తలొచ్చినా దీనిపై క్లారిటీ (Clarity) లేదు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మలయాళ బ్యూటీ నివేదా థామస్ (Nivetha Thomas) ఈ మూవీలో నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతి భార్యగా (Wife) ఆమె నటించనుందట. దీనిపై యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఈ మూవీతో కమ్‌బ్యాక్ (Comeback) గట్టిగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న పూరీ జగన్నాథ్ స్క్రిప్ట్‌తో పాటు క్యాస్టింగ్ (Casting) విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జూన్ (June) నుంచి ఈ మూవీ షూటింగ్ (Shooting) ప్రారంభం కాబోతుంది.
నివేదా థామస్ (Nivetha Thomas) చివరిగా ‘35 – చిన్న కథ కాదు’ (35 – Chinna Katha Kaadu)తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2024 సెప్టెంబర్ 6న విడుదలైన ఈ చిత్రం ఫీల్ గుడ్ (Feel Good) మూవీగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం (Middle-Class Brahmin Family) నేపథ్యం, గణితంలో వెనుకబడిన విద్యార్థి అరుణ్ (Arun) తల్లి సరస్వతిగా (Saraswathi) తన పాత్రలో జీవించింది నివేదా. ఈ చిత్రం 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో “ఇండియన్ ప్యానోరమా” (Indian Panorama) విభాగంలో ప్రదర్శించబడింది.
ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో తెలుగు తెరపై పెద్దగా కనిపించని ఈ బ్యూటీకి పూరీ జగన్నాథ్ మూవీలో ఛాన్స్ (Chance) వచ్చిందంటే దశ తిరిగినట్లే.