Home Entertainment Ram Charan : ఈ ప్లాన్ అదిరిందయ్యా చరణ్!

Ram Charan : ఈ ప్లాన్ అదిరిందయ్యా చరణ్!

buchi babu
buchi babu

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan).. రూట్ మార్చాడు. ఆచార్య, గేమ్ ఛేంజర్(Game Changer) నిరాశపరచడంతో.. పక్కాగా గట్టి హిట్ కొట్టాలని కసిగా పని చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో.. ఉప్పెన్(Uppena) ఫేమ్ బుచ్చిబాబుతో(Buchi babu) చేస్తున్న సినిమా.. ఇప్పటికే ట్రెండ్ ను క్రియేట్ చేసింది. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు.. రామ్ చరణ్ ను మళ్లీ సుక్కూ రంగస్థలం రేంజ్ లో చూపించడం ఖాయమని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ.. మరో సినిమా విషయంలో చరణ్ అడుగు ముందుకు వేసినట్టు తెలుస్తోంది. ఈ సారి సెపరేట్ జానర్ తో వచ్చి తన అభిమానులనే కాదు.. సినీ ప్రేక్షకులందరినీ థ్రిల్ చేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇది ఏ మాత్రం వర్కవుట్ అయినా.. బాలీవుడ్ లో కూడా సంచలనాన్ని సృష్టించడం ఖాయమన్నంతగా.. కథా చర్చల దశలోనే ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ గుసగుసలు.. మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

గత ఏడాది జులైలో విడుదలైన కిల్(Kill) చిత్రం బాలీవుడ్ లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలుసు కదా. బ్లాస్టింగ్ లెవల్లో ఉన్న యాక్షన్ సీన్స్.. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో.. దర్శకుడు నిఖిల్ నగేష్ భట్(Nikhil Nagesh Bhatt).. ప్రేక్షకులకు ఎంతటి సూపర్ థ్రిల్ కలిగించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. ఇప్పుడు అదే దర్శకుడితో రామ్ చరణ్ లైన్ సెట్ చేశాడన్న మాట.. బాలీవుడ్ టు టాలీవుడ్ బ్లాస్టింగ్ లెవల్లో చక్కర్లు కొడుతోంది. అది కూడా.. పౌరాణిక కథ అని తెలుస్తుండడం.. ఈ ప్రాజెక్ట్ పై అమాంతం ఆసక్తి, అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి. రామాయణం, మహా భారతం లాంటి పౌరాణిక గాధల నుంచి ఓ ఘట్టాన్ని తీసుకుని సినిమాను రూపొందించేందుకు నిఖిల్ భట్ కథ సిద్ధం చేసి.. రామ్ చరణ్ ను సంప్రదించాడని.. అందుకు ప్రైమరీగా చరణ్ కూడా ఓకే చెప్పాడని.. సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పూర్తి కథతో సిద్ధం కావాలంటూ నిఖిల్ కు చరణ్ టీమ్ నుంచి ఇన్ఫర్మేషన్ అందినట్టు కూడా తెలుస్తోంది.
Watch Video For More Details—>

https://youtu.be/wXQ73vOdU9A

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here