రెడ్ బుక్(Red book). ఈ పదం.. ఏపీ రాజకీయాలను ఎంత ప్రభావితం చేసిందో.. ఇప్పటికీ ఎంతగా ప్రభావితం చేస్తోందో చూస్తున్నాం. ఎన్నికలకు ముందు.. టీడీపీ(TDP) నేత లోకేశ్(Nara Lokesh) ఈ ఒక్క మాటతో అందరి అటెన్షన్ తన సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రి అయ్యాక కూడా అదే పాయింట్ తో విపక్షాన్ని అల్లాడిస్తున్నారు. అంతగా.. రెడ్ బుక్ అన్న మాట ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపింది. దీనికి.. జగన్ కూడా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. జగన్ 2.0 లో.. ప్రతీకారాన్ని చూస్తారని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే ట్రెండ్.. ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. లోకేశ్ రెడ్ బుక్ అన్నట్టుగానే.. ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలు పింక్ బుక్ అని కొత్త వాదన మొదలుపెట్టారు. తమ కార్యకర్తలను వేధించిన వారి పేర్లు పింక్ బుక్ లో ఎక్కుతాయని.. కవిత వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్(BRS) కార్యకర్తలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని కవిత(Kavitha) అంటున్నారు. తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో వేస్తున్నారని ఆరోపించారు. అందుకే.. తాము పింక్ బుక్(Pink Lips) మొదలు పెడుతున్నామని.. కచ్చితంగా అందులోకి ఎక్కిన పేర్లకు ఫ్యూచర్ లో సినిమా చూపిస్తామని ఇన్ డైరెక్ట్ గా కవిత వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినా కూడా పోలీసులను పంపించి కేసులు వేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇలా వేధించే వారి లెక్కలన్నీ సెట్ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. కేటీఆర్ కూడా ఇన్ డైరెక్ట్ గా ఈ వ్యవహారంపై స్పందించారు. తప్పుడు కేసులను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కచ్చితంగా ఫైట్ చేసి తీరుతామని కాస్త గట్టిగానే చెప్పారు. అంటే.. కవిత చెప్పిన పింక్ బుక్ కు.. కేటీఆర్ కూడా సపోర్ట్ చేసినట్టే అని జనాలు భావిస్తున్నారు.
Watch Video For More Details—>
https://youtu.be/XRDMRmTl7ls