Home Entertainment Saree Trailer Release : రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘శారీ’ ట్రైలర్ రిలీజ్

Saree Trailer Release : రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘శారీ’ ట్రైలర్ రిలీజ్

saree movie
saree movie

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ “శారీ”(Saree) సినిమా ఏప్రిల్ 4న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో సత్య యాదు(Satya yadu), ఆరాధ్య దేవి(Aradhya devi) ప్రధాన పాత్రల్లో నటించారు. “శారీ” సినిమా ట్రైలర్ హైదరాబాద్‌లో విడుదలైంది.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, “సోషల్ మీడియా(Social media) ద్వారా వ్యక్తిగత విషయాలు షేర్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి ఈ చిత్రం స్పష్టం చేస్తుంది,” అని తెలిపారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆరాధ్య దేవి మంచి ప్రదర్శన ఇచ్చారని, సత్య యాదు కూడా బాగా నటించాడని వర్మ అభిప్రాయపడ్డారు.

డైరెక్టర్ గిరి కృష్ణకమల్ చెప్పారు, “ఆరాధ్య దేవి నైజంగా నటించింది, సత్య యాదు కూడా అద్భుతంగా పర్‌ఫార్మ్ చేశాడు.”

హీరోయిన్ ఆరాధ్య దేవి సినిమా గురించి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ నాకు డ్రీమ్ ప్రాజెక్ట్” అని చెప్పింది. హీరో సత్య యాదు “ఇది చిన్న పాత్ర అయినా, చాలా కీలకమైనది” అని అభిప్రాయపడ్డారు.

సినిమా విడుదల తేదీ: ఏప్రిల్ 4
భాషలు: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here