2025లో మల్లారెడ్డి(Malla reddy) విశ్వవిద్యాపీఠ్ యొక్క వార్షిక దినోత్సవ(Annual day) వేడుకను స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarkonda) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుక సురారంలోని మల్లారెడ్డి క్రికెట్ గ్రౌండ్లో(Malla reddy Ground) నిర్వహించబడింది. ఈ వేడుకకు మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపకులు సిహెచ్ మల్లారెడ్డి, డా.
భద్రారెడ్డి (చైర్మన్), డా. సిహెచ్ ప్రీతి రెడ్డి (వైస్ ఛైర్మన్), హీరో నితిన్ మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “మనకు నచ్చిన పనిని చేస్తే మనం సంతోషంగా ఉంటాం,” అని చెప్పారు. “జీవితంలో మూడు ముఖ్యమైన విషయాలు ఆరోగ్యంగా ఉండటం, డబ్బు సంపాదించడం, మన ఇష్టమైన పనిని చేయడం,” అని ఆయన సూచించారు. అలాగే, తల్లిదండ్రుల మాటలు వినడం ముఖ్యమని ఆయన అన్నారు.
ఈ వేడుకలో డా. సిహెచ్ ప్రీతి రెడ్డి గారు చేసిన అద్భుత నృత్యం హాజరైన వారందరిని మంత్రముగ్దులను చేసింది. ముఖ్య అతిథులు: • సిహెచ్ మల్లారెడ్డి, వ్యవస్థాపకులు, ఛైర్మన్ • డా. భద్రారెడ్డి, ఛైర్మన్ • డా. సిహెచ్ ప్రీతి రెడ్డి, వైస్ ఛైర్మన్ • K.P. వివేకానంద్ గౌడ్, MLA • విజయ్ దేవరకొండ, స్టార్ హీరో • నితిన్, స్టార్ హీరో