Singer Chinmayi Sripada : ‘శృంగారం’పై రెచ్చిపోయిన చిన్మయి..

 

సింగర్ చిన్మయి(Singer Chinmayi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె పాడిన పాటలకంటే.. చెప్పిన డబ్బింగ్ కంటే.. ఇప్పటివరకూ చేసిన కామెంట్లపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. ఆమె పేరు చెబితే చాలు.. భయపడేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇది చాలు.. చిన్మయి చేసే కామెంట్ల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందన్నది అర్థం చేసుకోవడానికి. తాజాగా.. ఓ విషయంపై సెన్సేషనల్ కామెంట్లు చేయడంతో మరోసారి చిన్మయి వార్తల్లోకొచ్చింది. మగాళ్లంతా శృంగారాన్ని(Romance) వదిలేయాలంటూ.. ఓ నెటిజన్ కు ఆమె ఇచ్చిన రిప్లై.. క్షణాల్లో వైరల్ అయిపోయింది.

అసలేం జరిగిందంటే.. బ్లింకిట్(Blink it) అనే గ్రాసరీ డెలివరీ సంస్థ సీఈవో.. రీసెంట్ గా ఓ ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. తమ యాప్ నుంచి.. ఒకే ఒక్క రోజులో.. ఏకంగా లక్షకు పైగా కండోమ్స్(Condoms) అమ్మినట్టు పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కు రకరకాలుగా రిప్లైలు వచ్చాయి. అందులో ఓ నెటిజన్ కాస్త శృతి మించి స్పందించాడు. రోజుకు లక్ష కండోమ్స్ అమ్ముడవుతుంటే.. వర్జిన్ అమ్మాయిలు భార్యలుగా దొరకడం కష్టమే అంటూ బ్లింకిట్ సీఈవో ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ కొందరిని ఆకట్టుకుంటుంటే.. మరికొందరికి చిరాకు తెప్పించింది. అటు తిరిగి ఇటు తిరిగి ఇది చిన్మయి కంట్లో పడింది. వెంటనే దిమ్మతిరిగేలా రిప్లై ఇచ్చి పడేసింది.. చిన్మయి.

ఇకనుంచి మగాళ్లు పెళ్లికి ముందు అమ్మాయిలతో శృంగారాన్ని ఆపేయాలి. తమ ఫ్రెండ్స్ ని కూడా అలాగే బిహేవ్ చేసేలా చూడాలి. అన్నదమ్ములకు కూడా పెళ్లికి ముందు అలాంటి పని చేయొద్దని చెప్పాలి.. అంటూ చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇలా.. శృంగారంపై చిన్మయి చేసిన కామెంట్లు.. క్షణాల్లో వైరల్ గా మారాయి. ఆమె ఇచ్చిన రిప్లై శభాష్.. అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అమ్మాయిలను శృంగారం కోణంలో మాత్రమే చూసే మగాళ్లకు చెంపపెట్టులా చిన్మయి ట్వీట్ చేసిందని చాలా మంది ఓపెన్ గానే అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిలు వర్జిన్ గా ఉండాలని కోరుకునే మగాళ్లంతా.. వర్జిన్ గా ఉండాలని, అప్పుడే ఇలాంటి కామెంట్లు చేయాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here