సంక్రాతి బరిలో… తమన్, భీమ్ మ్యూజిక్ రేస్..

సినిమాకైనా, సాంగ్స్ కైనా హైప్ తీసుకురావ‌డానికి మ్యూజిక్ ఎంత కీల‌క పాత్ర పోషిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఈసారి సంక్రాంతికి వ‌స్తున్న సినిమాల్లో రెండు సినిమాల‌కు త‌మ‌నే సంగీతం అందిస్తున్నాడు. త‌మ‌న్ వ‌ల్ల గేమ్ ఛేంజ‌ర్, డాకు మ‌హారాజ్ రెండు సినిమాల పైన అంచ‌నాలు పెరిగాయి.

ఈ రెండు కాకుండా వెంకటేష్ నటిస్తున్న “సంక్రాంతికి వ‌స్తున్నాం” సినిమా కూడా పండ‌క్కి రిలీజ్ కానుంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు స్టార్ హీరోల‌కు ప‌ని చేసిన అనుభ‌వం లేని భీమ్ ఈ సినిమాతో ఆఛాన్స్ అందుకుని దాన్ని బాగానే స‌ద్వినియోగం చేసుకున్నాడు. పండక్కి ఈ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయ‌ని తెలిసిన‌ప్పుడు త‌క్కువ బ‌జ్ ఉన్న సినిమా వెంకీ సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ అనే చెప్పాలి..

తమన్ మ్యూజిక్ ముందు,, భీమ్ మ్యూజిక్,,మ్యాజిక్ చేయదులే అని అనుకున్నారు..కానీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ సీన్ రివ‌ర్స్ అయిపోయింది. వెంకీ సినిమాకు భీమ్స్ ఇచ్చిన మూడు సాంగ్స్ ఛార్ట్ బస్ట‌ర్ల‌య్యాయి. ఆడియోతో పాటూ ఆ పాట‌ల‌ను అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన విధానం కూడా బావుండ‌టంతో ఆడియ‌న్స్ ఈ పాట‌ల‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా త‌మ‌న్ సంగీతంలో వ‌చ్చిన సాంగ్స్ భీమ్స్ సాంగ్స్ ను డామినేట్ చేయ‌లేక‌పోవ‌డం అంద‌రికీ షాకింగ్ గానే ఉంది. అయితే కేవ‌లం సాంగ్స్ తో ఎవ‌రు బెస్ట్ అని చెప్ప‌లేం. థియేట‌ర్ల‌లో త‌న బీజీఎంతో త‌మ‌న్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాడ‌నేది అర్థ‌మ‌వుతుంది. సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాకు బీజీఎం ప‌రంగా అంత ప్రాధాన్య‌త ఉండ‌క‌పోవ‌చ్చు. ఏదైనా త‌మ‌న్, భీమ్స్ లో పై చేయి ఎవ‌రిద‌నేది తెలియాలంటే జ‌న‌వ‌రి 14 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here