Home Entertainment Sodhara Movie Release : ఏప్రిల్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంపూర్ణేష్ బాబు ‘సోదరా

Sodhara Movie Release : ఏప్రిల్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంపూర్ణేష్ బాబు ‘సోదరా

Sampoornesh Babu, Sodara movie, Telugu film, Sanjosh, brotherhood movie, Telugu entertainment, Sampoornesh Babu film, Telugu cinema
Sampoornesh Babu, Sodara movie, Telugu film, Sanjosh, brotherhood movie, Telugu entertainment, Sampoornesh Babu film, Telugu cinema

వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్‌ బాబు.. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’. చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేయడానికి థియేటర్స్‌ల్లో విడుదల కాబోతుంది. మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకత్వంలో క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. ఇంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే నాలుగు పాటలకు మంచి స్పందన లభించాయి. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తోంది. తప్పకుండా మా సోదరా చిత్రం ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ” సంపూర్ణేష్‌ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here