Home Sports Virat Kohli : రిటైర్మెంట్‌తో చారిత్రక అవకాశాన్ని కోల్పోయిన రన్ మెషీన్!

Virat Kohli : రిటైర్మెంట్‌తో చారిత్రక అవకాశాన్ని కోల్పోయిన రన్ మెషీన్!

Virat Kohli retirement, Kohli Test career, Virat Kohli records, Kohli vs Sangakkara, cricket milestones, 10000 runs in Tests, Kohli cricket stats, Indian cricket news, Kohli centuries, Test cricket legends
Virat Kohli retirement, Kohli Test career, Virat Kohli records, Kohli vs Sangakkara, cricket milestones, 10000 runs in Tests, Kohli cricket stats, Indian cricket news, Kohli centuries, Test cricket legends

విరాట్ కోహ్లి మరో 770 పరుగులు చేసినట్లయితే, అతను ఒక అరుదైన ఘనతను సాధించేవాడు. టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో, శ్రీలంక మాజీ లెజెండ్ కుమార సంగక్కర తర్వాత అటు వన్డే, ఇటు టెస్టుల్లో పది వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం కోల్పోయాడు. సంగక్కర 2015లో రిటైర్ అయినప్పటి నుంచి, ఇంకెవరూ ఈ రెండు ఫార్మాట్లలో ఈ ఘనతను అందుకోలేకపోయారు. కోహ్లి టెస్టుల్లో 123 మ్యాచ్‌లలో 9230 పరుగులు చేసి, మరో 770 పరుగులు మాత్రమే దూరంలో ఉన్న సమయంలో రిటైర్మెంట్ తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అతను ఇప్పటికీ ఫిట్‌నెస్, ఫామ్ పరంగా ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరం. అంతేకాకుండా, కోహ్లి ఇప్పటివరకు 82 అంతర్జాతీయ సెంచరీలు చేసి, సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడని అనుకున్న ఆశలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కోహ్లి టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పి వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here