తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(Telangana congress).. ఇబ్బందుల్లో పడినట్టే కనిపిస్తోంది. రెడ్ల(Reddy) ఆగ్రహం.. ఆ పార్టీకి ప్రాణసంకటంలా మారింది. ఇటీవల వరంగల్ వేదికగా నిర్వహించిన బీసీల సభలో.. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న(Theenmar mallanna).. రెడ్లపై చేసిన కామెంట్లు.. రచ్చకు కారణమయ్యాయి. ఈ విషయంపై రెడ్డి జాగృతి నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచి.. కాంగ్రెస్ నే తిడుతూ.. రెడ్లపై దుమ్మెత్తిపోస్తున్న ఆయనపై.. కఠినంగా స్పందించాలని స్పష్టం చేస్తున్నారు. లేదంటే.. కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. అవసరమైతే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బహిష్కరిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ గాంధీభవన్ దగ్గర ధర్నాకు దిగారు. తమ వాయిస్ ను గట్టిగా వినిపించారు.
ఈ అనూహ్య పరిణామం.. తెలంగాణ కాంగ్రెస్ కు అనుకోని ఇబ్బందులను సృష్టిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు గట్టిగా సిద్ధమవుదామని చేస్తున్న పార్టీ ప్రయత్నాలకు గండి కొడుతోంది. కులగణనతో ప్రజల్లోకి వెళ్లి మంచి మార్కులు తెచ్చుకుందామని చేసిన ప్లాన్.. ఇలా రివర్స్ అయ్యిందేంటా అని ఆ పార్టీ ఆలోచనలో పడేసేలా ఈ పరిణామాలు ప్రభావం చూపిస్తున్నాయి. తోటి మంత్రులు సహకరించినా సహకరించకున్నా.. పార్టీలో ముఖ్య నేతలు కలిసి వచ్చినా కలిసి రాకున్నా.. ఎలాగైనా సరే పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి.. జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు.. ఈ అనూహ్య పరిణామాలు అడ్డంకిగా మారుతున్నాయి. ఫలితంగా.. మల్లన్న విషయంలో స్ట్రాటజీ మార్చకుంటే.. అది పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిణామాలు తీసుకురావడం తథ్యమన్న అభిప్రాయానికి.. రేవంత్ రెడ్డి అండ్ టీమ్ వచ్చేలా పరిస్థితులు మారిపోతున్నాయి.
Watch Video For Full Details—>