Home Telangana CM Revanth Reddy : ఇన్నాళ్లకు ఓపెన్ అయిపోయిన రేవంత్!

CM Revanth Reddy : ఇన్నాళ్లకు ఓపెన్ అయిపోయిన రేవంత్!

revcabth
revcabth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy).. మరోసారి సీరియస్‎గా మాట్లాడారు. ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీ వైఖరిపై విమర్శల దాడి చేశారు. ఇటీవలి నియామక ప్రక్రియల్లో ఉద్యోగాలు సాధించిన వారికి.. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో(Ravindra bharathi) నిర్వహించిన నియామక పత్రాల అందజేతకు.. రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుపై విరుచుకుపడ్డారు. వారి పాలన వైఖరి కారణంగానే.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తాను ఇబ్బంది పడాల్సి వస్తోందంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చే దిశగా.. వడ్డీలు కట్టడానికే ప్రస్తుత ఆదాయం సరిపోతోందని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని.. ప్రజలు సహకరిస్తున్నారని చెప్పిన రేవంత్.. కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని అనుకుంటుంటే.. కేసీఆర్ మాత్రం తన ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నట్టు ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here