వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).. సూపర్ యాక్టివ్ అయ్యారు. గత 9 నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వంపై అడపా దడపా విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన.. ఈ సారి మాత్రం బెబ్బులిలా గర్జించారు. కార్యకర్తలకు నేనున్నా.. అంటూ భరోసా ఇచ్చారు. విపక్షంలో ఉన్న వారికి బెదిరింపులు కామన్ అంటూ.. అలాంటి సమస్యలకు భయపడవద్దని, కేడర్ కోసం అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో.. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 9 నెలలుగా కూటమి ప్రభుత్వ వ్యవహారశైలిపై ఘాటైన కామెంట్లు చేశారు.
కార్యకర్తలు ఎవరైనా.. ప్రభుత్వ తీరుకు భయపడితే.. తన చరిత్రను గుర్తు చేసుకోవాలని కోరారు. తనపై.. గతంలో కాంగ్రెస్(Congress), టీడీపీ(TDP) కలిసి.. విపరీతంగా కేసులు పెట్టించాయని.. 16 నెలల పాటు తాను జైలు జీవితం అనుభవించినా.. తిరిగి బయటికి వచ్చి ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రిని అయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని కార్యకర్తల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తప్పుడు కేసులు పెడతారని, బెదిరిస్తారని.. జైల్లో కూడా పెడతారని.. ఇలాంటి వాటికి అస్సలు భయపడవద్దని సూచించారు. ప్రతి కార్యకర్త కోసం తాను అండగా నిలబడతానని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు(Chandrababu) ముఖ్యమంత్రి అయితే.. ఇచ్చిన హామీలు తీర్చలేరని తాను గతంలోనే చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని చెప్పారు.










