రాజకీయ వ్యూహకర్తగా.. ప్రత్యర్థులపై ధాటిగా ధీటుగా విమర్శలతో విరుచుకుపడే వాగ్దాటి ఉన్న నేతగా.. అమిత్ షా(Amit shah) ఎలాంటి నాయకుడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతటి అమిత్ షా నే.. గతంలో జైలు పాలయ్యారట. వారం పాటు కారాగార జీవితాన్ని అనుభవించారట. జైల్లో తనపై దాడి కూడా జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అందరితో పంచుకున్నారు. అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. తనకు ఈ వేధింపులు ఎదురైనట్టు గుర్తు చేసుకుని.. ఆ పార్టీపై విమర్శలు చేశారు. అందుకు దారి తీసిన పరిస్థితులను కూడా అమిత్ షా వివరించారు.
డేర్గావ్ లోని లచిత్ బర్ఫూఖాన్ పోలీస్ అకాడమీని.. అస్సాంలో అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలను అందరితో షేర్ చేసుకున్నారు. అప్పట్లో అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేదని.. హితేశ్వర్ సైకియా(Hitheshwar Sykiya) ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు.
https://youtu.be/A7ZYPPtXf1A