పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. అంటూ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేసిన తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత MLA మల్లారెడ్డి(Malla reddy).. టాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. చిరంజీవి తర్వాత నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నది ఎవరు అంటూ.. చాలా కాలంగా జరుగుతున్న చర్చకు.. తనదైన రీతిలో మల్లారెడ్డి సమాధానమిచ్చారు. చిరంజీవి తర్వాత అంతటి స్థానాన్ని అందుకున్నది.. అల్లు వారి వారసుడు అల్లు అర్జున్(allu arjun) అని తేల్చేశారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ప్రపంచ ఖ్యాతి దక్కిందని.. అందుకే టాలీవుడ్లో కచ్చితంగా చిరు తర్వాత స్థానం అతనిదే అని మల్లన్న స్పష్టం చేశారు.
గతంలో ఓ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) కలిసి అతిధిగా హాజరైన మల్లారెడ్డి.. ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి సినిమాలపై ఎంతో అభిమానాన్ని ప్రదర్శించారు. చిరు సినిమాను చూసేందుకు పడిన కష్టాలను కూడా చెప్పి చప్పట్లు కొట్టించారు. చిరంజీవిపై అంతటి అభిమానాన్ని చూపించిన మల్లారెడ్డి.. ఇప్పుడు అల్లు అర్జున్ పై ఒక్కసారిగా ప్రేమను కనబరిచారు. బన్నీ క్రేజ్ ఇప్పుడు నేషనల్ కాదని.. ఇంటర్నేషనల్ అని చెప్పి.. అల్లు వారి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. మల్లారెడ్డి కామెంట్లపై నేరుగా ఎవరూశస్పందించకపోయినా.. టాలీవుడ్ లో మాత్రం ఈ విషయంపై కాస్త ఆసక్తికరమైన చర్చే జరుగుతున్నట్టు తెలుస్తోంది.










