పూరి జగన్నాథ్(Puri jagandh). ఈ పేరు చెబితే చాలు. సినిమాల్లో హీరో లెవెల్ ను.. ప్రేక్షకుల అంచనాలకు అందని స్థాయిలో కనబడుతుంది. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, పోకిరి.. ఇలాంటి సినిమాలు పూరి జగన్నాథ్ టాలెంట్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాయి. అవసరమైతే 30 రోజుల్లో కూడా అద్భుతమైన సినిమా తీయగలనని, విజయం సాధించగలనని పూరి జగన్నాథ్ చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. అలాంటి పూరి.. ఎప్పుడైతే చార్మితో(Charmi) జతకట్టాడో.. ఆనాటి నుంచి ఆయనలోని పెన్ పవర్ తగ్గిపోయింది. విజయాల స్థానంలో అపజయాలు వచ్చి పడ్డాయి. కెరీర్ పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది. బిజినెస్ మెన్ లాంటి భారీ విజయాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అందుకున్న మహేష్ బాబు కూడా.. ఆయన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. జనగణమన అనే సినిమాని మహేష్ బాబుతో తీయాల్సి ఉన్నా .. వరుసగా ఎదురైన పరాజయాల నేపథ్యంలో.. అదే మహేష్ తనని పక్కన పెట్టాడంటూ ఓ సందర్భంగా పూరి జగన్నాథ్ చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది.
https://youtu.be/HJ-1ghngJ1M