200 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమించి(Land Scam), బోర్డు పెట్టిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) భార్య పీఏ గజ్జల నర్సింహ రెడ్డి(Gajjala Narsimha reddy), గచ్చిబౌలి సీఐ హబీబుల్లాఖాన్ ప్రకారం, కొండాపూరులో(Kondapur) సర్వే నం. 87/2లో 2.08 ఎకరాల భూమి ఉంది. 2006లో వైవీ సుబ్బారెడ్డి(Subba reddy) సతీమణి స్వర్ణలతారెడ్డి ఈ భూమిని లక్ష్మయ్య మరియు ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశారు. తర్వాత, ఈ భూమిని L&T కంపెనీకి లీజుకు ఇచ్చారు. గడువు ముగియగా, 2022లో కంపెనీ భూమిని ఖాళీ చేసింది. ఆ తర్వాత, అనిల్ రెడ్డి(Anil reddy) మరియు అతని అనుచరులు భూమిలో ప్రవేశించి, బోర్డు పెట్టారు. భూమిని ఖాళీ చేయమని కోరినందుకు, అనిల్ రెడ్డి మరియు అతని అనుచరులు స్వర్ణలతారెడ్డిపై దాడి చేశారంటూ ఆమె జనవరి 5న గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేశారు. జనవరి 8న, స్వర్ణలతారెడ్డి చేసిన ఫిర్యాదుల మేరకు, అనిల్ రెడ్డి పేరుతో ఉన్న బోర్డును తొలగించి, నర్సింహ రెడ్డి పేరుతో కొత్త బోర్డు పెట్టారు. పోలీసులు అక్కడ వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న వ్యక్తులు మళ్లీ వస్తామని తెలిపారు.










