తెలంగాణలో(Telangana) ఆరోగ్యశ్రీ సేవలు(Arogyasri) నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో, ఆసుపత్రుల(Hospitals) యజమాన్యాలు సేవలను నిలిపివేయాలని ప్రకటించాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన కారణంగా, సామాన్య ప్రజలు ఆసుపత్రుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.