రెండేళ్ల క్రితం వచ్చిన ప్రశ్నాపత్రాన్ని మళ్లీ ఇవ్వడం కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో(kaloji Health University) అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వరంగల్(Warangal) – పీజీ రేడియాలజీ పరీక్షలో(Radiology) 2023 ఏడాది ప్రశ్నాపత్రం మళ్లీ ఇవ్వడం, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు చూపించిన నిర్లక్ష్యానికి సూచనగా నిలిచింది. 2023 నవంబరులో జరిగిన పరీక్షకు ఇచ్చిన ప్రశ్నాపత్రాన్ని(Question paper), ఈనెల 16న జరిగిన పేపర్ 3 పరీక్షలో కూడా అదే ప్రశ్నాపత్రం ఇవ్వడం, విద్యార్థులను తీవ్రంగా ఆశ్చర్యపెట్టింది. పేపర్ కోడ్ కూడా మార్పు చేయకుండా, అప్పటి కోడ్ నంబరుతోనే ప్రశ్నాపత్రాన్ని ఇచ్చిన అధికారుల నిర్లక్ష్యం పై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరీ ఇంత నిర్లక్ష్యమా!
రెండేళ్ల కిందటి ప్రశ్నాపత్రం మళ్లీ ఇచ్చిన వైనం
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం
వరంగల్ – పీజీ రేడియాలజీ ప్రస్తుతం నిర్వహించిన పరీక్షకు 2023 పాత ప్రశ్నాపత్రం తిరిగి ఇవ్వడం కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యానికి… pic.twitter.com/PZNTr5mxww
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025










