తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. నిజంగా రేవంత్‌కు ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్నా అనే విషయం నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై(Metro) ప్లానింగ్ ఉందా? అని ప్రశ్నించారు.
కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు