SLBC టన్నెల్ ఘటనలో ఇవాళ కూడా విస్తృత స్థాయిలో సహాయ చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పటికే.. 6 రోజులు దాటిపోయినా.. 8 మంది కార్మికుల జాడ మాత్రం దొరకలేదు. అసలు ఆ 8 మంది ప్రాణాలతో ఉన్నారా.. లేదా అన్నది కూడా అనుమానాస్పదంగా మారింది. అందుకే.. ఈ రోజు మరింత విస్తృతంగా సహాయ చర్యలు చేపట్టాలని అధునాతన సాంకేతికతతో ప్రభుత్వం ప్రయత్నాలు కంటిన్యూ చేస్తోంది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ వంటి అధునాతన సాంకేతికను ఇవాళ వినియోగించనుంది. దీనికి సంబంధించిన పరికరం నుంచి విద్యుదయస్కాంత తరంగాలు టన్నెల్ లోపలికి వెళ్లి.. అక్కడ ఉన్న ప్రతి వస్తువును టచ్ చేస్తాయి. ఆ పరికరానికి ఉన్న యాంటెనా ద్వారా.. అంతా రికార్డ్ అవుతుంది. ఫలితంగా.. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో అసలు ఏముందనేది స్పష్టంగా అంచనా వేయవచ్చని అధికారులు, సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే.. కార్మికుల జాడపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.