తెలంగాణ(Telangana) ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు(Cast census Survey) చట్టబద్ధత లేదని కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర బీజేపీ(BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చట్టబద్ధంగా కులగణన చేయాలంటే అది కులగణన ద్వారానే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని(Hyderabad) నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర బీజేపీ నాయకుల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
జనగణనలో కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి ఎలా చక్కగా తీసుకెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం. కుల గణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul gandhi) విజయంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్‌కు సమర్థవంతంగా ప్రతిస్పందించేందుకు బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
బ్రిటిష్ కాలంలో చివరిసారిగా కులగణన జరిగిన తర్వాత, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాన్ని మరోసారి చేపడుతుందని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కిషన్ రెడ్డి సూచించారు. ఉమ్మడి పది జిల్లాలవారీగా కుల సంఘాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి, కుల సర్వే మరియు కుల గణన మధ్య తేడాను ప్రజలకు వివరించాలన్నారు.
కులగణన చట్టంలో సవరణలు చేసి, చట్టబద్ధంగా కులాల లెక్కలు తీసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వేను ఆదర్శంగా పరిగణించలేమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
స్వతంత్ర భారతదేశంలో తొలిసారి కుల గణన చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రెండు నుంచి మూడు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 15 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.