డార్లింగ్ ప్రభాస్(Prabhas).. కల్కి విజయంతో జోరుమీదున్నాడు. తాజాగా.. మంచు విష్ణు(Manchu vishnu) లీడ్ రోల్ చేస్తున్న కన్నప్ప(Kannappa) సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నా సినిమాలో ప్రభాస్ నటిస్తన్నాడు అంటూ.. చాలా సందర్భాల్లో మంచు విష్ణు గర్వంగా చెప్పుకున్నాడు కూడా. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ.. రీసెంట్ గా విష్ణు చేసిన ఓ పనే.. ప్రభాస్ కు తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్(Spirit) సినిమాలో నటించాలన్న ఆసక్తితో.. ఆ సినిమా ఆడిషన్స్ కు తాను అప్లై చేసుకున్నట్టు విష్ణు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా.. చూడాలి ఏం జరుగుతుందో.. అని కూడా కామెంట్ చేశాడు. అంటే… తాను తన సినిమాలో ప్రభాస్ కు అవకాశం ఇస్తే.. ప్రభాస్ ఆయన సినిమాలో తనకు అవకాశం ఇస్తాడో లేడో చూస్తానని విష్ణు అన్నట్టే కదా.. అని అంతా అనుకుంటున్నారు. ఇది ప్రభాస్ కు తలనొప్పులు తెచ్చినట్టు కాదా.. అని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి… స్పిరిట్ సినిమాలో నటించేవాళ్ల విషయం దర్శకుడు సందీప్ రెడ్డి చూసుకుంటాడు. నటీనటులను ఆయనే ఖరారు చేస్తాడు. ఆడిషన్స్ కు దరఖాస్తు చేశాడు కాబట్టి.. మంచు విష్ణు అవసరం అనుకుంటే తీసుకుంటాడు లేకుంటే లేదు. ఇక్కడ ఎటొచ్చీ చిక్కులు ఎదుర్కోవాల్సింది ప్రభాసే.
For more details watch video–>










