రేవంత్ రెడ్డి(Revanth reddy).. తెలంగాణ కాంగ్రెస్ లో ఒంటరి అయిపోయినట్టున్నారు. తనకు తోటి నేతల నుంచి ఏ మాత్రం కూడా సహకారం అందడం లేనట్టుంది. కనీసం.. ఎదురెదురుగా కూడా కుర్చీలు వేసుకుని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేనంత దీన పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్న తీరు కనిపిస్తోంది. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన.. తన తోటి నేతల గురించి, కేబినెట్ సహచరుల గురించి చేసినట్టుగా కొన్ని కామెంట్లు ప్రచారంలోకి వచ్చాయి. అవి గమనిస్తున్న వారంతా.. ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం నుంచి జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు. వన్ మెన్ ఆర్మీగా రేవంత్ వ్యవహారశైలి ఉంటున్న తీరును ప్రస్తావిస్తున్నారు. పేరుకు మాత్రమే కేబినెట్.. కలిసి తీసుకునే నిర్ణయాలు తక్కువే అని పెదవి విరుస్తున్నారు.
ఇంతకీ.. రేవంత్ మాట్లాడినట్టుగా ఉన్న వ్యాఖ్యలు ఏంటంటే.. నేను బాగా పని చేద్దామని చూస్తున్నా. కానీ నా తోటి వాళ్లే నన్ను సరిగా పని చేయనివ్వట్లేదు. వాళ్లంతా నా కుర్చీ కోసం ఆశ పడుతున్నారు
For more details watch video–>