Home Entertainment Manchu Family Fight : మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య...

Manchu Family Fight : మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య ట్వీట్ యుద్ధం

manchu family
manchu family

మోహన్ బాబు(Mohan Babu) కుటుంబంలో సంభవించిన వివాదాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(andhra pradesh) రాష్ట్రాలలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ సంఘటన ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. సంక్రాంతి పండుగకు సంతోషంగా గడపాల్సిన మంచి కుటుంబం ఈ సమయంలో వివాదాల్లో చిక్కుకుంది.

సంక్రాంతికి ముందు శ్రీ విద్యానికేతన్ లో మోహన్ బాబు(Mohan babu), విష్ణు(Manchu vishnu) ఫ్యామిలీ పండుగను జరుపుకుంటుండగా, కనుమ రోజు మనోజ్ అన్ ఎంట్రీ హైడ్రామా ప్రారంభించింది. ఈ గొడవల నేపథ్యంలో తిరుపతి(Tirupati) జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటనలపై పోలీసుల దర్యాప్తు కూడా ప్రారంభమైంది.

శ్రీ విద్యానికేతన్ సమీపంలో ఉన్న డెయిరీ ఫామ్ వద్ద జరిగిన వివాదాలపై ఇరువర్గాల ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనిక దంపతులు, పళణి రాయల్, రెడ్డి పవన్, ఇతరులపై కేసు నమోదు చేశారు.

మనోజ్(Manchu manoj) ఫిర్యాదుతో మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు, MBU సిబ్బంది 8 మందిపై కేసు నమోదు చేశారు. తనపై, భార్య మౌనికపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్న మనోజ్ పై కేసు నమోదు చేశారు.

ఇక, మంచు బ్రదర్స్ మధ్య ఫైట్ ఎక్స్(X) లో కూడా కొనసాగుతోంది. విస్ను, మనోజ్ ట్వీట్ల ద్వారా వార్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. విష్ణు, తన ఇష్టమైన డైలాగ్ తో పోస్ట్ చేసిన ఎక్స్ పోస్ట్ కు, మనోజ్ కౌంటర్ పోస్ట్ చేసి మరో చర్చను తెర వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here