ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్(Sid Sri Ram) హైదరాబాద్‌లో ఫిబ్రవరి 15న ఒక లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను(Music concert) నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమాన్ని మూవ్78 లైవ్(Move78 live) సంస్థ ఏర్పాటు చేసింది. ఈ మేరకు, ఈ కాన్సర్ట్ గురించి వివరాలు వెల్లడించడానికి, సింగర్ సిధ్ శ్రీరామ్ మరియు మూవ్78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్ మీడియాతో సమావేశమయ్యారు.
ఈ ప్రెస్ మీట్లో సిధ్ శ్రీరామ్ మాట్లాడుతూ, ‘‘గత పదేళ్లుగా తెలుగు ఆడియెన్స్ నుండి నాకు పెద్ద ప్రేమ అందింది. నాకు తెలుగులో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ చేశాను, ఇప్పుడు మరోసారి చేయబోతున్నాను.
ఈ కాన్సర్ట్‌లో నా పాటలతో పాటు 80, 90వ దశకాల్లో వచ్చిన మెలోడీ పాటలు కూడా పాడతాను. ప్రస్తుతం నేను తెలుగు నేర్చుకుంటున్నాను. ఒక ఏడాది తర్వాత తెలుగులో నిశ్చయంగా ఫ్లూయెంట్‌గా మాట్లాడగలుగుతాను’’ అని తెలిపారు.
నితిన్ కనకరాజ్ మాట్లాడుతూ, ‘‘సిధ్ శ్రీరామ్‌తో మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యాం. ఈ ఈవెంట్ ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియెన్స్ మరియు యువత కోసం ఏర్పాటు చేస్తున్నాం.
సిధ్ శ్రీరామ్‌ను వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఈ జెనరేషన్లో సిధ్కు పెద్ద క్రేజ్ ఉంది. ఈ లైవ్ కాన్సర్ట్ అద్భుతంగా ఉంటుంది. గ్రూపులుగా టికెట్లు బుక్ చేస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది’’ అని చెప్పారు.