ఓ మృగాడు కట్టుకున్న భార్యను(Husband) అత్యంత కిరాతకంగా చంపాడు(Kill). కడుపుతో ఉన్న భార్యపై(Pregnant wife) కూర్చుని నరకయాతన పెట్టాడు. దీంతో గర్భంలోని పిండం కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఇంత దారుణానికి కారణం భార్యపై అతడికున్న అనుమానం. ఆ అనుమానమే ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అవి హత్యలేనని తేల్చారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ (21)కు కొన్నాళ్ల క్రితం కాప్రాకు చెందిన స్నేహ (21) అనే యువతితో ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ప్రమేగా మారడంతో 2022లో ఇద్దరూ పెళ్లి(Marriage) చేసుకున్నారు. వీరి జంటకు 2023లో ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత సచిన్ చేస్తున్న పని మానేసి జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కొడుకును పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మాలని పథకం వేశాడు. భర్త దుర్మార్గం గ్రహించిన స్నేహ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లకు అనారోగ్యంతో ఆ బాబు కూడా మృతి చెందాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్లు ఎడమొఖం పెడముఖంగా ఉండసాగారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ కలిసిపోయిన ఈ జంట కాప్రాలో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టి గత ఏడాది డిసెంబరు 11 నుంచి కలిసుండ సాగారు. అయితే అప్పటికే 7 నెలల గర్భవతైన భార్య స్నేహపై సత్యనారాయణకు అనుమానం మొదలైంది. గర్భం ఎలా దాల్చావంటూ నిత్యం వేదించేవాడు. ఈ క్రమంలోనే జనవరి 15న రాత్రి భార్యకు ఫూటుగా మద్యం తాగించాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో భార్య కడుపుపై కూర్చుని, దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. కడుపు మీద కూర్చుని తొక్కడంతో కడుపులో పిండం మృతి చెంది బయటకు వచ్చింది. ఇంత దారుణానికి పాల్పడిన సత్యనారాయణ భార్య మృతిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.