ఉదయం అలసటతో మేల్కొనడం, మొత్తం రోజు అలసటతో గడవడం వల్ల పనులపై దృష్టి పెట్టడం కష్టంగా మారుతుంది. సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల తేలికపాటి నిర్ణయాలు కూడా తీసుకోలేరు.
తగినంత నిద్ర లేకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి, ఇది రక్తపోటును పెంచి గుండెపై మరింత ఒత్తిడి కలిగిస్తుంది.
నిద్రలేమి కళ్ల మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయి పెరగడం వలన కళ్ల కింద నల్ల వలయాలు(Dark Circles) మరియు మచ్చలు ఏర్పడతాయి.
ఉదయం అలసటతో మేల్కొనడం, మొత్తం రోజు అలసటతో గడవడం వల్ల పనులపై దృష్టి పెట్టడం కష్టంగా మారుతుంది. సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల తేలికపాటి నిర్ణయాలు కూడా తీసుకోలేరు.
అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. హృదయ స్పందన కూడా పెరుగుతుంది.
అందుకే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతి రోజు 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన ఒత్తిడి తగ్గిపోతుంది మరియు అనేక వ్యాధుల ముప్పు తగ్గుతుంది.