నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వరుసగా దసర, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హిట్ అందుకున్నాడు. అలాగే రీసెంట్ గా హిట్ 3తో భారీ విజయాన్ని అందుకున్నాడు నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాని యాక్షన్ ఇరగదీశాడు. భారీ హిట్ దిశాగా దూసుకుపోతోంది హిట్ 3. దసరా సినిమా తర్వాత మరోసారి నాని మాస్ అవతార్ లో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం నాని హిట్ 3 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తుంది.
ఇక ఇప్పుడు నాని వరుసగా సినిమాలు లైనప్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాలో నాని మరోసారి మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో దసర సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి నాని మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకోనున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా హీరోయిన్ గా ఓ యంగ్ సెన్సేషన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కాయదు లోహర్ నటిస్తుందని టాక్. ఇటీవలే డ్రాగన్ సినిమాతో పాపులర్ అయ్యింది ఈ భామ. గతంలో శ్రీ విష్ణు నటించిన అల్లూరి సినిమాలో నటించింది కాయదు. ఇప్పుడు ఈ భామ నాని సినిమాలో ఛాన్స్ అందుకుంది తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు రానున్నాయి.