
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) లేటెస్ట్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.. నిర్మాత రవిశంకర్(Ravi Shankar). రాబిన్ హుడ్(Rabinhood) సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. తన తర్వాతి సినిమాలపై కూడా మాట్లాడుతూ.. RC 16పై సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్ అద్దిరిపోయిందని.. గ్లింప్స్ చూసిన తర్వాతే ఈ విషయాన్ని చెబుతున్నానని రవిశంకర్ చెప్పారు. అంతేకాదు.. ప్రత్యేకంగా చేసిన ఓ సీన్ కోసమైతే.. గ్లింప్స్ ను మెగా అభిమానులే కాక.. సాధారణ ప్రేక్షకులు కూడా కనీసం వెయ్యిసార్లైనా చూసి తీరుతారని స్పష్టం చేశారు. అంత అద్భుతంగా సీన్ పండిందని చెబుతూ.. అంచనాలు పెంచేశారు.
ఉప్పెన సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు.. చాలా కాలం పాటు ఈ ప్రాజెక్టు కోసం వెయిట్ చేశాడు. గేమ్ చేంజర్(Game changer) ను పూర్తి చేసుకున్న వెంటనే.. రామ్ చరణ్ ఈ సినిమా సెట్ లో జాయిన్ అయ్యాడు. కథ కూడా చాలా బాగా కుదిరిందంటూ ఇప్పటికే సినిమాపై బజ్ వినిపించింది. పైగా.. హీరోయిన్ గా జాన్వీ కపూర్.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. ఈ ప్రాజెక్టుకు తోడు కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో.. స్పోర్ట్స్ కథాంశంతో సినిమా రానున్నట్టుగా గుసగుసలు కూడా జోరందుకున్నాయి. ఇంతలో.. నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్లతో.. మరోసారి సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రామ్ చరణ్ చేసిన రెండు సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. తండ్రి చిరంజీవితో కలిసి చేసిన ఆచార్యలో.. చరణ్ నటనకు మార్కులు బాగానే పడ్డాయి కానీ.. ఫలితం మాత్రం అనుకున్నంతగా రాలేదు. తర్వాత.. విలక్షణ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరోవైపు.. మిగతా హీరోల్లో.. ఎన్టీఆర్ దేవర అంటూ హిట్ కొట్టాడు. అల్లు అర్జున్ పుష్ప 2 అంటూ షేక్ చేశాడు. ప్రభాస్ అయితే కల్కి సక్సెస్ తర్వాత భారీ లైనప్ తో క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. యంగ్ హీరో అయిన నాగచైతన్య కూడా తండేల్ అంటూ.. సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇలాంటి తరుణంలో.. ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో రామ్ చరణ్.. బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు.