రామ్ చరణ్ 16(RC16) ప్రాజెక్ట్.. ఫుల్ లెంగ్త్ లో పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. పూర్తి స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్న దర్శకుడు బుచ్చిబాబు(Buchi babu).. ఇప్పటికే 2 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేశాడు. కొన్ని రోజుల్లోనే హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi kapoor) తో మరో షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఇంతలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం.. ఆర్సీ ఫ్యాన్స్ ను ఉత్సాహంలో నింపింది. ఈ మూవీలో.. కన్నడ స్టార్ శివన్న(Shivanna) కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ కు కోచ్ గా(Coach) నటించనున్నాడు. కుస్తీ మాస్టర్ గా.. చిత్రాన్ని మలుపు తిప్పే కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. కానీ.. ఆయన రీసెంట్ గా క్యాన్సర్ బారిన పడ్డాడు. సుదీర్ఘంగా చికిత్స తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.. తన అభిమానలకే కాక.. చరణ్ ఫ్యాన్స్ కు కూడా గుడ్ న్యూస్ చెప్పాడు.
బెంగళూరులో రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ కు శివన్న అటెండయ్యాడు. అభిమానులతో పాటు.. అందరి ఆశీర్వాదమే తనను కాపాడిందని చెప్పాడు. క్యాన్సర్(Cancer) నుంచి పూర్తిగా కోలుకున్నట్టు స్పష్టం చేశాడు. అతి త్వరలో సినిమా షూటింగ్స్ కు హాజరు కానున్నట్టు వెల్లడించాడు. మరోవైపు.. శివన్న కోసమే రామ్ చరణ్ కూడా ఎదురుచూస్తున్నట్టు సమాచారం. గురు శిష్యులుగా నటించనున్న ఈ ఇద్దరి మధ్యే.. అతి కీలకమైన సీన్స్ ను దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేసినట్టు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే.. శివన్న కోలుకున్నాడని తెలియగానే.. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు. వచ్చే మార్చి నుంచి ఈ ఇద్దరి మధ్యా ఆర్సీ 16 సీన్స్ షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుకుని సంబరాలకు కూడా సిద్ధమవుతున్నారు.
హీరోగా రామ్ చరణ్, హీరోయిన్ గా జాన్వీ కపూర్, సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్, కీలక పాత్రలో శివన్న.. ఇలాంటి పాన్ ఇండియా స్టార్లను పెట్టి సినిమా తీస్తున్న దర్శకుడు బుచ్చిబాబు.. ఇప్పటికే టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా(Sport Drama) సినిమాను తీస్తున్నట్టు ఇప్పటికే అందరికీ తెలుసు. అలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే.. గతంలో తన గురువు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో కూడా బుచ్చిబాబుకు బాగా తెలుసు. అంతకుమించిన విజయాన్ని సాధించే ప్రయత్నంలోనే.. తన ప్రయత్నాన్ని పూర్తి చేసేందుకు ఆయన ట్రై చేస్తున్నాడు. ముందుగా టాకీ పార్ట్ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇదంతా తెలిసి గేమ్ చేంజర్ ఫీల్ నుంచి బయటపడేందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రై చేస్తున్నారు. బుచ్చిబాబు అయినా తమ హీరోకు అద్భుతమైన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నారు.