ఒక uber డ్రైవర్(Uber Delivery) నెలకి 12 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇది వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా.. గావింగ్ ఎస్ కోలర్ అనే ఉబర్ డ్రైవర్ తనకి ఎంతో ఇష్టమైన హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అమ్మాలని దానికి సంబంధించి షాప్ పెట్టాలని కలకన్నాడు.. అయితే ఆర్థిక సమస్యలతో అది సాధ్యం కాక ఉబర్ డ్రైవర్గా తన జీవితాన్ని మొదలుపెట్టాడు.. పనిలో పడిపోయినకానీ కలను మాత్రం ఏ మాత్రం మర్చిపోలేదు.. Car నే జ్యువలరీ షాపింగ్ గా మార్చేసి ఊబర్లో ఎక్కే పాసింజర్స్ కి తన కార్లోనే చిన్న హ్యాండ్ మేడ్ జువెలరీ(Hand Made jwellery) బ్రాస్లెట్స్ ని రింగ్స్ ని అమ్మడం చేయడం మొదలు పెట్టాడు.. అవి చాలా బాగా నచ్చడంతో కష్టమర్స్ కూడా ఎట్రాక్ట్ అయ్యి అవి కొనుగోలు చేసేవారు…. దీంతో మరో రెండు కార్లను కొనుగోలు చేసి,, జ్యువెలరీ sale చేయడానికి ట్రైన్డ్ డ్రైవర్స్ ని పెట్టాడు.. దీంతో అతని సంపాదన కాస్త నెలకు 12 లక్షల అయిపోయింది.. అంటే సంవత్సరానికి దాదాపుగా రెండు కోట్ల సంపాదన సంపాదిస్తున్నాడు.. తనలాగే కలలు కనే వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కూడా మన లక్షాన్ని మర్చిపోకూడదని ఆదర్శంగా నిలుస్తున్నాడు..