
భారత్(Bharath)-పాకిస్థాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది అనధికారిక యుద్ధంగానే కొనసాగుతోంది. పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్”లో(Operatio sindhoor) భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. ప్రతిగా పాకిస్థాన్ భారత రాష్ట్రాలపై దాడికి యత్నించగా, భారత్ వాటిని విజయవంతంగా అడ్డుకుంది. ఈ క్రమంలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో చాలా భాగం నకిలీగా ఉండటంతో ఫ్యాక్ట్ చెకర్లు అవి ఫేక్ లేదా ఏఐ ఆధారితవని తేల్చారు.
ఈ పరిస్థితుల్లో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందిస్తూ భారత సైన్యాల ధైర్యసాహసాలను ప్రశంసించాడు. నకిలీ వార్తలు పంచకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పౌరులను కోరాడు. దేశ రక్షణలో ఉన్న సైనికులపై గర్వంగా ఉందంటూ, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ట్వీట్ చేశాడు.