వేసవికాలంలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే పుచ్చకాయ ఫలం మాత్రమే కాదు, దాని గింజలు, తొక్క కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని కొందరికి మాత్రమే తెలుసు.
చాలామంది పుచ్చకాయ తినాక మిగిలే తొక్కను వ్యర్థంగా పారేస్తుంటారు. కానీ నిజానికి పుచ్చకాయ తొక్కలో కూడా చర్మానికి చాలా మేలు చేసే గుణాలు ఉంటాయి. వేసవిలో ఎండకు తగిలి చర్మం మసకబారినప్పుడు, పుచ్చకాయ తొక్కలో ఉండే తెల్లటి భాగాన్ని ఉపయోగించడం వల్ల చర్మం మునుపటి కాంతిని తిరిగి పొందుతుంది.
ఈ తొక్కను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి, వచ్చిన రసాన్ని ముఖం, చేతులు, కాళ్లపై అప్లై చేయాలి. కొన్ని నిమిషాలపాటు ఉంచి, తర్వాత కడిగేయాలి. ఇది టాన్‌ను తొలగించడంతో పాటు చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
అలాగే, వేసవిలో మొటిమలు వస్తున్నట్లయితే పుచ్చకాయ తొక్కలోని తెల్ల భాగాన్ని రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌గా చేసి మొటిమలపై రాస్తే, అవి త్వరగా తగ్గిపోతాయి.
పుచ్చకాయ తొక్కలో విటమిన్ A, C, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిచ్చి, దెబ్బలు, గాయాలు త్వరగా నయం కావడానికి సహాయపడతాయి. పుచ్చకాయ తొక్కను సరిగా వినియోగిస్తే చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది.