తెలంగాణ కాంగ్రెస్లో(Telangana congress) చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇవాళో, రోపో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తారని ఆశావహులంతా ఎదురు చూస్తున్న తరుణంలో.. సడన్ గా మీనాక్షి నటరాజన్ రాకతో.. సీన్ పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్లూ జరిగిన వడపోతను కాదని.. మరోసారి నేతల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ కోసం నిజంగా కష్టపడి పని చేసిన వారికి మాత్రమే.. పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించి గౌరవించాలని మీనాక్షి చేసిన స్పష్టమైన సూచనతో.. జిల్లాల్లోని సీనియర్ నేతలంతా.. అలాంటి వారి కోసం జల్లెడ పడుతున్నారు. కష్ట కాలంలో ఎవరు పార్టీకి అండగా నిలిచారు.. ఎలా ఆపదలో ఆదుకున్నారు.. వారి సేవలతో పార్టీకి దక్కిన ప్రయోజనం ఎంత.. ఇలాంటి విషయాలో ఆధారంగా నేతల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు.