తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy).. రాజకీయంగా రూట్ మార్చారు. సీఎం అయిన తర్వాత మొదటి ఏడాది దాదాపుగా.. వ్యవస్థను సెట్ చేయడానికి ఆయన టైమ్ తీసుకున్నారు. ఆ తర్వాత విపక్షాలపైనా కాన్సన్ ట్రేట్ చేశారు. కొన్నాళ్లుగా ఆ రూట్ మార్చి.. ప్రజలు, పరిపాలనపై మరింతగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే.. కులగణన(Cast sense), బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రమంతా అధికారులు ఈ సర్వే నిర్వహించారు. కులాల వారీగా లెక్కలు పూర్తి చేశారు. కానీ.. 2014లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే.. 10 ఏళ్ల తర్వాత నిర్వహించిన కులగణనలో.. బీసీల జనాభా నామమాత్రంగానే పెరిగినట్టు లెక్కలు చెప్పాయి. ఇదే పాయింట్ విపక్షాలకు ఆయుధంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. వెంటనే స్పందించిన సీఎం.. రెండో విడత సర్వే కూడా చేయిస్తున్నారు. తొలి విడతలో వివరాలు ఇవ్వని వారు ఈ సారి తమ వివరాలు నమోదు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయాన్ని అమలు చేశారు.
for more details watch video—>