
“వృశ్చికం”(Vrischikam) అనే సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ ఫిలింనగర్లో(Film nagar) ప్రారంభమైంది. మంగపుత్ర, యశ్విక జంటగా నటిస్తున్న ఈ సినిమాను మంగపుత్ర స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ ఆద్య నిర్మాణంలో శివరామ్ నిర్మిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ గౌరవ దర్శకత్వం వహించగా, కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విచ్ఛాన్ చేశారు, హబీబ్ సుల్తానా క్లాప్ ఇచ్చారు.
మంగపుత్ర మాట్లాడుతూ ఇది తన మొదటి హీరో, దర్శకుడిగా చేసే చిత్రం అని, ఇది 45 రోజుల్లో ముగించనున్న షెడ్యూల్‌తో, రామచంద్రాపురం, భద్రాచలం, హైదరాబాద్ లలో షూటింగ్ జరగనుందని తెలిపారు. యశ్విక, ప్రమోద్, క్రాంతి బలివాడ, కోసూరి సుబ్రహ్మణ్యం, సముద్రాల రవిచంద్ర తదితరులు ఈ చిత్రంపై తమ అనుభూతులు పంచుకున్నారు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిన్న సినిమాగా, ప్రేక్షకుల మద్దతు కోరుతున్నారు.