ఒకప్పుడు నిండుగా 11 మంది ఎంపీలతో తనకంటూ రాజ్యసభలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్(YSRCP). ఇప్పుడు ఆపరిస్థితి పూర్తిగా తారుమారైన పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా.. ఇటీవల విజయసాయిరెడ్డి(Vijaysai reddy).. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేయడం.. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం ఫలితంగా.. జగన్(YS Jagan) పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో(Parliament session).. పార్టీ తరఫున వాయిస్ ఎవరు వినిపిస్తారన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ.. విజయసాయిరెడ్డి రాజ్యసభలో గట్టిగా మాట్లాడారు. రాష్ట్ర సమస్యలు ప్రస్తావించారు. వైసీపీని సభలో లీడ్ చేశారు. ఎవరు ఏం మాట్లాడాలన్నది గైడెన్స్ ఇచ్చేవారు. కానీ.. ఇందాకే అనుకున్నట్టుగా అదంతా గతం. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు కాదు. కనీసం పార్టీ నాయకుడు కూడా కాదు. అందుకే.. ప్రస్తుతం సభలో ఉన్న వైసీపీ ఎంపీలకు సరైన దిశానిర్దేశం చేసే సీనియర్ లీడర్ కరువయ్యారు.