ఉసిరికి(Amla) ఉన్న ఔషధ గుణాల వల్ల, ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి ముఖ్యంగా శీతాకాలంలో జలుబు(cold), దగ్గు(cough) వంటి వ్యాధులు బారిన పడకుండా ప్రజలు దీన్ని ఎక్కువగా తింటుంటారు . ఫ్లూజ్వరం వంటివి వస్తే త్వరగా కోలుకోవడానికి కూడా ఉసిరి సహాయపడుతుంది. బరువు తగ్గాలని కోరుకుంటే, ఉసిరి చాల బాగా పనిచేస్తుంది .. నడుం దగ్గరి కొవ్వును(Fat) కరిగించి, సన్నని, నాజూకైన నడుము మీ సొంతం .. వ్యాయామం అంటే, సహజంగా ఉండే బద్ధకాన్ని కూడా నివారిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది అమృతం లాంటిది. ఇన్సులిన్ స్పందనను పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించగలుగుతుంది.గుండె సంబంధిత వ్యాదులున్నవారు కూడా ఉసిరిని తమ ఆహారంలోకి చేర్చుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇది కొలెస్టరాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది ., హృదయ రక్షణ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.