వరంగల్ సభలో భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ (KCR) చేసిన విమర్శలకు.. కాంగ్రెస్ (Congress) దీటుగా స్పందించింది. ప్రతి విమర్శను తిప్పికొడుతూ.. ప్రతి కౌంటర్ ను ఎన్ కౌంటర్ (Encounter) చేసింది. శాసన సభలో తేల్చుకుందాం రావాలంటూ.. మంత్రులు సీతక్క (Seethakka), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) కేసీఆర్ కు సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ విలన్ (Villain) గా కనిపిస్తోందా అంటూ.. భారత్ రాష్ట్ర సమితి అధినేతను మంత్రులు ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవినీతి ద్వారా కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో చెప్పమంటారా అంటూ నిలదీశారు. భారత్ రాష్ట్ర సమితి పరిపాలనలో ఏం జరిగింది.. కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరుగుతోంది అన్న ప్రతి అంశంపై మాట్లాడుకుందామంటూ మినిస్టర్లు కామెంట్ చేశారు. అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు.
మళ్లీ అధికారం భారత్ రాష్ట్ర సమితి దే అంటూ కేసీఆర్ చేసిన కామెంట్లపైనా.. మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ కేసీఆర్ పగటి కలలే (Daydreams) అని ఎద్దేవా చేశారు. వచ్చే మూడున్నర ఏళ్లు మాత్రమే కాదు.. రాబోయే 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తన కడుపులో విషం పెట్టుకున్నట్టుగా కేసీఆర్ మాట్లాడారంటూ విమర్శించారు. ప్రభుత్వంపై పూర్తిగా అసత్య ప్రచారం చేశారని అన్నారు.
సోనియాగాంధీ (Sonia Gandhi) తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యేదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. పదేళ్లపాటు కేసీఆర్ పాలనలో ఏం జరిగింది.. 15 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది అన్న ప్రతి విషయాన్ని ..అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. ఆరు రోజులైనా సరే.. ఎనిమిది రోజులైనా సరే చర్చ జరగాల్సిందే అని.. తేదీ ఎప్పుడో కేసీఆరే చెప్పాలని అన్నారు.
తెలంగాణను ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్ గా చిత్రీకరించడం సరికాదని మంత్రులు చెప్పారు. ఆనాడు సోనియాగాంధీని దేవత (Devi) అంటూ కేసీఆర్ పొగిడిన విషయాన్ని గుర్తు చేశారు. మీ కుటుంబం అంతా సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని మరిచిపోయారా కేసీఆర్.. అంటూ ప్రశ్నించారు.
ప్రజలు రెండుసార్లు అధికారం ఇస్తే తెలంగాణ సంపదను కొల్లగొట్టారని, అవినీతి మయంగా రాష్ట్రాన్ని మార్చేశారని.. అందుకే ప్రజలు భారత్ రాష్ట్ర సమితికి గట్టి గుణపాఠాన్ని (Lesson) చెప్పారని మంత్రులు చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి కీలకమైన సలహాలు సూచనలు ఇస్తారని ఆశించినా కూడా.. కేసీఆర్ నుంచి అటువంటి స్పందన ఏదీ లేదని అసంతృప్తి (Dissatisfaction) వ్యక్తం చేశారు.
ఉద్యమ పార్టీగా (Movement Party) మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా (BRS) మారిన క్రమంలో..1500 కోట్ల రూపాయలకు పైగా డబ్బు (Money) ఎలా సమకూర్చుకుందని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులకు అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు (Assets) ఎలా వచ్చాయని నిలదీశారు.
అన్ని విషయాలపై మాట్లాడుకుందామని.. చర్చకు సిద్ధమేనా అని మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, భారత్ రాష్ట్ర సమితి నేతలకు సవాల్ చేసిన తీరు.. సంచలనంగా (Sensation) మారింది. అలాగే.. కేసీఆర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.