ఇప్పటికే తీవ్ర వివాదాస్పదంగా మారిన కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వ్యవహారం.. తాజాగా మరో టర్న్ తీసుకుంది. ఈ భూముల కేంద్రంగా 10 వేల కోట్ల (Rs 10,000 crore) రూపాయల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ దగ్గర దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. బీజేపీకి సంబంధించిన ఓ ఎంపీకి ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా.. కంచ గచ్చిబౌలి భూములను ఇప్పటివరకు TGIICకి పూర్తి స్థాయిలో బదలాయింపు జరగలేదని కేటీఆర్ అంటున్నారు. టెక్నికల్ గా భూమిని ఇప్పటివరకూ కేటాయించనే లేదని చెబుతున్నారు. థర్డ్ పార్టీలు ఇందులో కీలకం అయ్యాయని.. అసలు ఏ లెక్కన ఆ సంస్థలను ఎంపిక చేసి భూములు కేటాయించినట్టు చెబుతున్నారో అంటూ అనుమానాలు లేవనెత్తారు. ఈ కుంభకోణం మొత్తానికి పూర్తి సూత్రధారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే (Chief Minister Revanth Reddy) అని.. కచ్చితంగా ఇదో నేరపూరిత కుట్రే అని కేటీఆర్ తేల్చి చెబతున్నారు. సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థలను సంప్రదిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీకి (BJP MP) ఉన్న భాగస్వామ్యాన్ని కూడా బయటపెడతామని కేటీఆర్ చెబుతున్నారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కూడా కేటీఆర్ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను గుర్తు చేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ అని ప్రత్యేకంగా చెప్పకపోయినా కూడా.. అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నట్టయితే.. యాజమాన్య హక్కులతో సంబంధం లేకుండా.. దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలంటూ 1996లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందన్నారు. అలాగే.. 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా.. అటవీ భూముల పరిధిలో ఉన్న వాటిని తాకట్టు పెట్టడానికి కానీ, అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు లేదని స్పష్టం చేశారు. ఇదేదీ పట్టించుకోకుండా.. రేవంత్ ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని ఆరోపించారు. ఇప్పటికే భూముల బదలాయింపుపై ఎలాంటి సేల్ డీడ్ కుదుర్చుకోకుండా.. ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి 10 వేల కోట్ల రూపాయల బాండ్లు బయటికి వచ్చాయని చెప్పారు. ఈ విషయంపై ఆధారాలతో సహా.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయబోతున్నట్టు చెప్పి సంచలనాన్ని సృష్టించారు. ఇది 10 వేల కోట్లతో ఆగే వ్యవహారం కాదని.. ఇంకో 60 వేల కోట్ల (60 thousand crores) రూపాయల దోపిడీకి కూడా ప్రణాళిక జరిగిందని చెప్పి.. మరో బాంబ్ పేల్చారు.
ఈ దోపిడీని అరికట్టేందుకే తమ పోరాటమని స్పష్టం చేసిన కేటీఆర్.. అవసరమైతే ప్రధాని మోదీని, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి వాస్తవాలను వివరిస్తామన్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. సహజంగానే.. కాంగ్రెస్ నేతలు వీటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నా.. నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రేవంత్ రెడ్డి ఒంటరి కావడం తప్పదన్న ఈ వ్యవహారంపై సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే.. చాలా సందర్భాల్లో రేవంత్ పై కేటీఆర్ మాత్రమే కాదు.. మరింతమంది నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ.. ఇంత భారీగా.. 10 వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటూ ఆరోపణలు రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ సమస్యను రేవంత్ ఎలా ఎదుర్కొంటారు.. ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందుతుంది.. కాంగ్రెస్ నేతలు ఎంత వరకు మద్దతుగా నిలుస్తారు.. అంతకుమించి పార్టీ అధిష్టానం నుంచి ఏ రకమైన అండదండలు అందుతాయి అన్నది ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇదే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఆయుధంగా మారుతోందనే అభిప్రాయం కూడా విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.
కేటీఆర్ చెబుతున్నట్టుగా.. రేవంత్ నిజంగానే ఇంత కుంభకోణం చేసి ఉంటారా.. లేదంటే ఆయన ఎలా ఈ ఆరోపణల నుంచి క్లీన్ చిట్ అందుకునే అవకాశం ఉంది.. సాధారణ రాజకీయాల్లో భాగంగానే కేటీఆర్ ఇలా ఆరోపణలు చేసి ఉంటారా..