తెలంగాణలో ప్రస్తుతం కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి చర్చ నడుస్తోంది. ఇప్పటికే వరంగల్ మామునూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్ పోర్టు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో.. మరో మంచి వార్త వినిపించింది.
1930లో నిజాం హయాంలో నిర్మించిన ఈ బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం వైమానిక దళ స్టేషన్‌గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. 2008లో మార్చి 23న శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభమైన తర్వాత.. బేగంపేట నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. 1930 నుంచి 2008 వరకు దాదాపు 8 దశాబ్దాల పాటు బేగంపేట ఎయిర్ పోర్టు సేవలందించింది. అయితే.. ప్రస్తుతం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి వీవీఐపీలు ప్రయాణించే విమానాలు, ప్రైవేటు ఫ్లైట్ల ల్యాండింగ్‌కు, టేకాఫ్‌కు మాత్రం అనుమతి ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు హైదరాబాద్ పర్యటనకు వస్తే బేగంపేటలోనే ల్యాండ్ అవుతుంటారు.