వైఎస్ఆర్ కాంగ్రెస్ కు(YSRCP) రాజీనామా(Resign) చేయడమే కాదు.. రాజకీయాల నుంచి కూడా పూర్తిగా తప్పుకొంటున్నట్టు ప్రకటించి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి(Vijaysai reddy) వ్యవహారం.. ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు కొనసాగిస్తూనే ఉంది. ఈ వ్యవహారంపై… టీడీపీ నేతలు(TDP) కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు విజయసాయిరెడ్డిని వదిలేదే లేదని తేల్చి చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా విజయసాయి ఎన్నో అక్రమాలు చేశారని చెబుతూ.. విచారణలో తప్పులు బయటపడిన అనంతరం.. చట్ట ప్రకారం ఆయన కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మంత్రి లోకేశ్(Nara Lokesh) కూడా ఇదే విషయంపై స్పందించాల్సి వచ్చింది. 2019 నాటి కేసుకు సంబంధించి విశాఖ న్యాయస్థానానికి హాజరైన లోకేశ్ కు.. విలేకరుల నుంచి విజయసాయికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అలా విలేకరులు అడగడమే ఆలస్యం.. ఇలా తీవ్రంగా స్పందించేసిన మంత్రి లోకేశ్.. మరోసారి రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి.. అందర్నీ షాక్ కు గురి చేశారు.
రెడ్ బుక్(Red book) గురించి తాను చెప్పిన విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయని లోకేశ్ తేల్చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా విజయసాయిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశారని మరోసారి ఆరోపించారు. అలాంటి వ్యక్తి టీడీపీలోకి వస్తే.. తీసుకునే ప్రసక్తే లేదని తేల్చారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. టీడీపీని, కార్యకర్తలను విజయసాయి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. విశాఖలో విజయసాయి వ్యవహారాలపై విచారణ కొనసాగతోందని చెప్పిన లోకేశ్.. వాస్తవాలు బయటపడిన తర్వాత చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని కుండబద్ధలు కొట్టారు. వైసీపీని వీడినంత మాత్రాన.. విజయసాయికి మంచి రోజులు వచ్చినట్టు కాదని.. పరోక్షంగా కుండబద్ధలు కొట్టారు.. లోకేశ్.
వైసీపీ నుంచి మరింత మంది సీనియర్ నేతలు కూడా వెళ్లిపోతున్న తీరుపై లోకేశ్ స్పందించారు. తల్లిని, చెల్లిని కూడా నమ్మని నాయకుడు జగన్ అని.. అలాంటి నాయకుడితో ఎవరు కలిసి పని చేస్తారని అన్నారు. డబ్బుల కోసం పార్టీని కూడా అమ్మేసే రకమంటూ సంచలనమైన కామెంట్లు చేశారు. తాను మాత్రం టీడీపీకి ఏనాడు చెడ్డపేరు తీసుకురానని చెప్పారు. విశాఖ కోర్టులో కేసు విచారణ కోసం వచ్చిన తాను.. పార్టీ బస్సులోనే పడుకుని.. తన డబ్బులతోనే ప్రయాణ ఖర్చులు పెట్టుకుని ఉన్నట్టు తెలిపారు. మంత్రిని అయినా కూడా.. సొంత వాహనాన్ని మాత్రమే వాడుకున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో కనీసం వాటర్ బాటిల్ కూడా కొనుక్కోలేదని తేల్చి చెప్పారు.
విజయసాయి వ్యవహారంపై మొదలైన లోకేశ్ కామెంట్లు.. ఇలా వైసీపీ సీనియర్లు ఆ పార్టీని వీడడంపైనా స్పందించేవరకూ వెళ్లాయి. మొత్తంగా విజయసాయి వస్తానన్నా కూడా టీడీపీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పడమే కాకుండా.. అసలు విజయసాయిని వదిలేదే లేదంటూ మరోసారి హెచ్చరించేలా లోకేశ్ కామెంట్లు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇంకెంత వరకు వెళ్తుందన్నది.. చూడాల్సిందే. మరి.. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్టు చెప్పిన విజయసాయి.. నిజంగానే టీడీపీని ఆశ్రయించే అవకాశం ఉందా..